Bollywood

ఈ ఓటిటి యాప్ లో కూడా “విక్రమ్” స్ట్రీమింగ్.! |

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా స్టార్ హీరో సూర్య కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కం క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల అయ్యిన అన్ని చోట్ల కూడా బ్లాస్టింగ్ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు కొల్లగొట్టి భారీ లాభాలను తెచ్చి పెట్టింది. మరి థియేటర్స్ లో అయ్యాక ఈ చిత్రం రిలీజ్ ఓటిటి లో వరుస పెట్టి వస్తుంది.

మొదటగా డిస్నీ+ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం తర్వాత మన తెలుగు యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే మరో స్ట్రీమింగ్ యాప్ లో కూడా రానున్నట్టు ఫిక్స్ అయ్యింది. ఈసారి ప్రముఖ యాప్ జీ 5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుందట. మరి ఇందులో కూడా అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నట్టు వారు తెలిపారు. మరి ఆ సబ్ స్క్రైబర్స్ అయితే ఈ సినిమాని ఇప్పుడు నుంచి వీక్షించవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published.