Bollywood

గుంటూరులో ఘనంగా జరిగిన మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ …. ! |

యంగ్ డైనమిక్ అండ్ వర్సటైల్ యాక్టర్ నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీలో క్యాథరీన్ త్రెసా, కృతిన్ శెట్టి హీరోయిన్స్ గా నటించగా మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నుండి సాంగ్స్ తో పాటు టీజర్ అందరినీ ఇప్పటికే ఎంతో ఆకట్టుకోగా నేడు గుంటూరు బ్రాడీపేట లోని ఎల్ ఈ ఎం స్కూల్ గ్రౌండ్స్ లో ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసింది యూనిట్. కాగా ఈ ఈవెంట్ కి మాచర్ల నియోజకవర్గం టీమ్ తో పాటు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన అనిల్ రావిపూడి పాల్గొన్నారు.

ఇక ఈ మూవీ ట్రైలర్ పక్కాగా మాస్ కమర్షియల్ హంగులతో ఎంతో ఆకట్టుకుని మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచింది. ముఖ్యంగా ట్రైలర్ లో నితిన్ పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, భారీ ఫైట్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విలన్ గా నటించిన సముద్రఖని డైలాగ్స్, సీన్స్ ఆకట్టుకున్నాయి. అలానే గ్రాండ్ విజువల్స్ తో పాటు హీరోయిన్స్ ఇద్దరి సీన్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా ఈ మూవీ ట్రైలర్ మూవీ పై భారీ స్థాయి అంచనాలు క్రియేట్ చేసింది అనే చెప్పాలి. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దీనిని ఎంతో అద్భుతంగా తీసారని, తప్పకుండా ఆగష్టు 12న రిలీజ్ తరువాత మూవీ అందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ,ఎప్పుడో సై మూవీ టైం లో ఫస్ట్ టైం గుంటూరు వచ్చాను, ఆ తరువాత అఆ మూవీ టైం లో వచ్చాను, మళ్ళి ప్రస్తుతం ఈ మూవీ కోసం వచ్చాను. మీరు రెండు సార్లు ఎంతో ప్రేమ చూపించారు. తప్పకుండా ఈ మూవీని కూడా మీరు హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. నా కెరీర్ బెగిన్ అయి 20 ఏళ్ళు అయింది, నిజానికి నా మూవీ కెరీర్ లో మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను, ఈ మూవీ సాంగ్స్ పెద్ద హిట్ చేసారు, అలానే మూవీ కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అలానే ఈ మూవీ కి డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రాణం పెట్టి పని చేసారని, హీరోయిన్స్ ఇద్దరి పెర్ఫార్మన్స్ తో పాటు ప్రతిఒక్క పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నితిన్ అన్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య మూవీ పనుల్లో బిజీగా ఉన్నపటికీ మా కోరిక మేరకు గుంటూరు విచ్చేసిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నితిన్.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తన 20 ఏళ్ళ సినీ కెరీర్ లో నితిన్ ఎంతో కష్టపడి పలు ఎత్తుపల్లాలని చూశారన్నారు. నిజానికి ఈ విధంగా కెరీర్ లో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడడం అంత ఈజీ కాదని, ఇక ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ చూస్తే తప్పకుండా ఆయన ఖాతాలో మరొక సూపర్ హిట్ ఖాయం అన్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి మాస్ యాక్షన్ చూడలేదని అన్నారు. అనిల్. దర్శకడు రాజశేఖర్ రెడ్డి కి, నిర్మాతలు నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి, హీరోయిన్స్ ఇద్దరితో పాటు టీమ్ మొత్తానికి మూవీ సక్సెస్ కావాలని ముందుస్తు అభినందనలు తెలిపారు. తప్పకుండా వీలైతే భవిష్యత్తులో నితిన్ తో ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు అనిల్ చెప్పారు.

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ, తమ మూవీ ఈవెంట్ కి భారీగా తరలి వచ్చిన ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు కృతి. నితిన్ రాను రాను అంటూనే చిన్నదో సాంగ్ కి డ్యాన్స్ వేయడం చూస్తుంటే ఫస్ట్ మూవీకి ఎలా డ్యాన్స్ చేసారో ఇప్పుడు కూడా అదే జోష్ మెయింటెయిన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మంచి మనసు వలనే అది జరిగిందన్నారు. మరొక హీరోయిన్ క్యాథరీన్ తో పాటు సముద్రఖని తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, నిర్మాతలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన కృతి, తన ఫస్ట్ మూవీ ఉప్పెన మాదిరిగా మాచర్ల నియోజకవర్గం కూడా పెద్ద సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడుతూ, మా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గుంటూరు లో చేయడం అలానే ఇంత భారీ ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు తరలి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మా వేడుకకి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి టీమ్ ని విష్ చేయడం మరింత ఆనందంగా ఉందని, తప్పకుండా ఆగష్టు 12న రిలీజ్ కానున్న మూవీ తప్పకుండా మీ అందరినీ అలరించి మంచి సక్సెస్ కొడుతుందని నమ్మకాన్ని వెలిబుచ్చారు నిఖితా రెడ్డి .

సముద్రఖని మాట్లాడుతూ, మాచర్ల నియోజకవర్గం అద్భుతమైన కమర్షియల్ మూవీ, ఇటువంటి మూవీ లో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది, మూవీ టీమ్ కి ప్రత్యేక అభినందనలు. అలానే హీరో నితిన్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్క రోజు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు సముద్రఖని.

హీరోయిన్ క్యాథరీన్ త్రెసా మాట్లాడుతూ, చాలా రోజుల తరువాత ఈ మూవీలో మంచి బాబ్లీ, జయ్ ఫుల్ రోల్ చేశాను, నితిన్ గారు ఈ మూవీలో మంచి పవర్ఫుల్ రోల్ చేసారు, ఆగష్టు 12న రిలీజ్ అవుతున్న మా మూవీని తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అని ఆమె అన్నారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ, నితిన్ అన్న అంటే నాకు ఎంతో ఇష్టం, నాకు మొదట అవకాశం ఇచ్చింది నితిన్ అన్నే. తన సినిమాలోని సాంగ్స్ అయితే చాలు నేను ప్రాణం పెట్టి చేస్తాను. ముఖ్యంగా ఇందులో రాను రాను అంటూనే చిన్నదో సాంగ్ అందరినీ అలరిస్తుంది నిర్మాతలు నిఖితా రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి హీరోయిన్స్ తో పాటు స్పెషల్ సాంగ్ చేసిన అంజలి అందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పారు.

ఇక ఈ మూవీకి డీవోపీ గా ప్రసాద్ మురెళ్ళ, పీఆర్వో గా వంశీ శేఖర్, సమర్పకుడిగా రాజ్ కుమార్ ఆకెళ్ళ, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ ని మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్ గా సాహి సురేష్, ఫైట్ మాస్టర్ గా ని వెంకట్ వర్క్ చేసారు.

Source link