Bollywood

“చరణ్ 15”, “గాడ్ ఫాథర్” ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన థమన్.! |

ప్రస్తుతం మన టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో థమన్ కూడా ఒకడు. ఇప్పుడు తెలుగు సహా తమిళ్ లో పలు భారీ చిత్రాలు చేస్తున్న తాను ఆ సినిమాలతో మంచి బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రాల్లో మెగా హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి లతో తమ సినిమాలు తాను చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలపై థమన్ లేటెస్ట్ గా రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

మొదటగా చరణ్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ శంకర్ తో సినిమా మ్యూజికల్ వర్క్స్ చరణ్ తో అద్భుతంగా జరిగాయని ఇద్దరు కలిసి ఉన్న ఫోటో షేర్ చెయ్యగా అలాగే మెగాస్టార్ తో గాడ్ ఫాథర్ పై కూడా బిగ్ క్లారిటీ ఇస్తూ ఈ సినిమా అక్టోబర్ 5నే రిలీజ్ అవుతుంది అని తాను కూడా క్లారిటీ ఇచ్చాడు. దీనితో అయితే ఈ రెండు సినిమాలపై థమన్ రెండు అప్డేట్స్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.



Source link