Bollywood

టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సంయుక్తా మీనన్ …. ! |

ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యారు కేరళ భామ సంయుక్తా మీనన్. ఆ మూవీలో దగ్గుబాటి రానాకి జోడీగా ఆమె కనిపించారు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటించారు.

రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా కొద్దిరోజుల నుండి మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది యూనిట్. అందులో భాగంగా నేడు మీడియాతో సంయుక్తా మాట్లాడుతూ, ఈ మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, ముఖ్యంగా హీరో కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి నటించారని, తప్పకుండా బింబిసార మంచి విజయం అందుకుంటుందని ఆమె అన్నారు. అలానే టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, మహేష్, పవన్ ల గురించి ఆమె పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఇటీవల బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ తో మాట్లాడానని, ఆయన నటనా ప్రావిణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. ఇక పవన్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం అని, ఆయన ఎందరికో ఇన్స్పిరేషన్ అన్నారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, మహేష్ ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ వంటి వారని, ఆయన ప్రక్కన మూవీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు.

Source link
[the_ad id=”1767″]

Leave a Reply

Your email address will not be published.