Bollywood

పవన్ ని మరో లెవెల్లో నిలబెట్టే సినిమాగా “హరిహర వీరమల్లు”.! |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ఓ భారీ సినిమా “హరిహర వీరమల్లు” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లోనే ఇది ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియా సినిమా కాగా ఇదే అధిక బడ్జెట్ తో భారీ హంగులు నడుమ తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా మన దగ్గర పవన్ క్రేజ్ కోసం గాని తన స్టార్డం కోసం గాని అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం నిర్మాత ఏ ఎమ్ రత్నం లేటెస్ట్ గా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం పవన్ అభిమానుల్లో వైరల్ గా మారింది. పవన్ స్టార్డం కోసం అందరికీ తెలుసు కానీ ఈ సినిమా ద్వారా పవన్ ని మరో లెవెల్లో నిలబెట్టడమే మేము కోరుకుంటున్నామని దాని కోసం చేయాల్సింది అంతా చేస్తామని కష్టపడి పవన్ ని వేరే లెవెల్లో నికబెట్టడమే మా టార్గెట్ అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. మరి ఫుల్ ఫ్లెడ్జ్ గా పవన్ ఈ సినిమాలో ఎలా ఉంటాడో చూడాలి.

Supply hyperlink