Bollywood

బాలయ్య సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ బిందు మాధవి |

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ బిందు మాధవి ఓ కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అని, బాలయ్యకి కూతురు పాత్ర అని టాక్ నడుస్తోంది. హీరోయిన్ శ్రీలీల కూడా బాలయ్యకి కూతురిగా ఈ సినిమాలో నటిస్తోంది. ఇక జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని.. అది రవితేజనే అని గతంలో వార్తలు వచ్చాయి. రవితేజ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్ గా సాగుతూ.. ఇంటర్వెల్ కి సినిమా ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published.